Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనుకున్నట్టుగానే అమిత్ ను బయటకు పంపిన బిగ్ బాస్!

  • ఎలిమినేట్ అయిన అమిత్
  • బిగ్ బాంబ్ ను దీప్తిపై వేసిన అమిత్
  • 90 రోజుల తరువాత బయటకు వచ్చిన అమిత్
అందరూ అనుకున్నట్టుగానే ఈ వారంలో టాలీవుడ్ బిగ్ బాస్ నుంచి అమిత్ ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేషన్ జోన్ లో కౌశల్, గీతామాధురి, రోల్ రైడాలు ఉండగా, గీతామాధురి, కౌశల్ సేఫ్ జోన్ లోకి ముందే వెళ్లిపోయారు. ఆపై రోల్, అమిత్ లకు మధ్య ఫ్యాన్స్ ఓటింగ్ లో స్వల్ప తేడావుందని చెప్పిన బిగ్ బాస్, అమిత్ ఎలిమినేట్ అయినట్టు ప్రకటించాడు. దీంతో దాదాపు 90 రోజులపాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అమిత్, తన బ్యాగులు సర్దుకుని, అందరికీ సెండాఫ్ చెబుతూ బయటకు వచ్చాడు.

ఇక బయటకు వచ్చిన తరువాత తనకిచ్చిన బిగ్ బాంబ్ ను దీప్తిపై విసిరాడు. దీని ప్రకారం, ఈ వారమంతా, ఎవరు తన జుట్టును దువ్వుకోవాలన్నా దీప్తితో దువ్వించుకోవాలి. హౌస్ లోని వారెవరూ దువ్వెన ముట్టుకోకూడదు. ఇక మిగిలిన పోటీదారులపై అభిప్రాయాలను చెప్పాలని నాని కోరగా, రోల్ చాలా జెన్యూన్ అని, దీప్తి సేఫ్ ప్లే ఆడుతోందని, తనీష్ కు తానే హీరోనన్న ఫీలింగ్ ఎక్కువని, కౌశల్ కన్నింగ్, స్మార్ట్ అని చెప్పాడు.
Biggboss
Amit
Eliminate

More Telugu News